చేవెళ్లలో పల్లెనిద్ర కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు రాత్రి అక్కడే బస చేశారు. హైదరాబాదులో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడికి ఆయన బయలుదేరడంతో మొయినాబాద్ పోలీసులు శుక్రవారం ఉదయం రామ్ చందర్రావును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. రామంతపూర్ లో హై టెన్షన్ వైర్లు తగిలి ఐదు మంది, సికింద్రాబాద్లో ఒకరు అంబర్పేటలో ఒకరు చనిపోయారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.