రామాయంపేట మండల వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తిరడం లేదు. మండల కేంద్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం యూరియా కోసం రైతులు బారులు తీరారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. సొసైటీకి యూరియా లారీ వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకుని యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు. కాట్రియాల గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా లారీ రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు.