షాద్నగర్ మున్సిపాలిటి పరిధి సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యులు స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ, జయ జయరామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.