పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం వద్ద ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు నుంచి 4.79 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో కృష్ణా నది పొంగిపొర్లుతుంది. ఈ వరద ప్రకాశం బ్యారేజ్ అని చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి మండల తాసిల్దార్ డానియల్ శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో హెచ్చరించారు. శివాలయానికి వచ్చిన భక్తులు కృష్ణమ్మ ఉధృతిని చూసి పులకరించిపోయారు.