అల్లూరి జిల్లా పెదబయలు మండలానికి కేంద్ర బిందువైన గోమంగిలో మండల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో గోమంగి వారపు సంత వద్ద గోమంగి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కొమ్మ పద్మనాభం, గోమంగి సర్పంచ్ సత్తిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1983వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన పెదబయలు ఇప్పటికీ మండలం గా కొనసాగుతుందని 17 పంచాయతీలు ఉన్న గోమంగి నుండి పెదబయలు వెళ్లాలంటే కష్టతరంగా మారిందని గోమంగిని మండలం గా చేయాలని డిమాండ్ చేశారు.