ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచల కొండపై వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు గురువారం ద్వారకాతిరుమల పోలీసుస్టేషన్ వద్ద సీఐ యూజే విల్సన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల బైక్ లను పార్కింగ్ ఏరియా, బస్టాండ్ వద్ద రవి అనే వ్యక్తి దొంగిలించే క్రమంలో సీసీ కెమెరాలో రికార్డు అయిందని, తద్వారా దొంగతనం గురించి చేసిన దర్యాప్తులో అతడు ఇప్పటికీ 18కి పైగా బైక్ లు దొంగిలించినట్లు తెలిందని పేర్కొన్నారు..