ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న ఘటన మంగపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కమలాపురంకు చెందిన నిఖిల్ అనే యువకుడు సెంట్రింగ్ పనుల నిమిత్తం వెళ్తుండగా జబ్బోనిగూడెం మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నాడు.