వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామంలో పశువులఆసుపత్రికి అధికారులు సమయానికి రాకపోవడంతోరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద వేచి ఉన్నా వైద్యులులేకపోవడంతో అనారోగ్య పశువులకు చికిత్సఅందడం లేదు. నిర్ణీత సమయానికి సేవలు లభించకపశువులు చనిపోతున్నాయని రైతులు వాపోయారు.జీవనాధారమైన పశువులను రక్షించేందుకు ఆసుపత్రిసమయానికి తెరవాలని విజ్ఞప్తి చేశారు.