ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందని వైసిపి రాష్ట్ర వైద్య విభాగ అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగిందంటూ పిడుగురాళ్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన కార్యాలయంలో పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడమేనని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.