అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీరుకు నిరసనగా నెల్లూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఆగ్రహం వ్యక్తం చేశారు.