రామచంద్ర౭పురం నియోజకవర్గాన్ని పూర్తిగా కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ అమ్మిరాజు కోరారు. ఈ కార్య క్రమంలో కో-కన్వీనర్ బి. సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.