వినాయక మండపాల ఏర్పాటు కు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రాయదుర్గం సిఐ జయానాయక్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని వినాయక ఉత్సవాల నిర్వాహకులతో స్థానిక పోలీసు స్టేషన్ వద్ద సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనుమతి కోసం ఆన్ లైన్ పోర్టల్ లో అప్లై చేసుకోవచ్చన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.