రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం పర్యటించిన చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంబేద్కర్ చౌక్ లోని గ్రంథాలయం ముందు మహాత్మ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.