పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాంలో గల అర్బన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలపై మార్గదర్శనం చేశారు. పదవ తరగతి విద్యార్థులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని, సమయసారిని ప్రకారం చదువుకోవాలని, కఠినమైన అంశాలపై ఉపాధ్యాయుల సూచనలు సలహాలు తీసుకొని, ఎక్కువగా అభ్యాసం చేసి ఫలితాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ఇందులో ప్రధానోపాధ్యాయురాలు నీరజ రాణి, ఉపాధ్యాయులున్నారు.