ఒకే విషయాన్ని పదే పదే చెబితే అది జనాలకు కూడా ఎక్కేది ఉండదని చరిత్ర రుజువు చేసిన సత్యం. విశాఖలో అందమైన పర్యాటక ప్రాంతం రుషికొండ అన్నది అందరికీ తెలుసు. ఆ కొండ మీద వైసీపీ ప్రభుత్వం దాదాపుగా అయిదు వందల కోట్ల ఖర్చుతో భారీ భవనాలను నిర్మించింది అయితే రుషికొండను తవ్వేశారు, గుండు కొట్టించారు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. దాంతో మొత్తం అటెన్షన్ అంతా ఆ వైపు ఉండేది జనాలు కూడా ఔను సుమీ అన్నట్లుగా చర్చించుకునేవారు. విశాఖలో వైసీపీ పరాజయానికి సైతం రుషికొండ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉందని అంటారు.