తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క మహా జాతర ప్రతీ రెండేళ్ళకొకసారి మేడారం మహా జాతర సందర్భంగా పంట నష్టపోతున్న భూములకు యాభై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతుల అఖిలపక్షం తరపున డిమాండ్ చేశారు. నేడు మేడారంలో మేడారం జాతర పంట నష్టపరిహార సాధన సమితి ఆధ్వర్యంలో రైతుల విస్తృత స్థాయి సమావేశం నేడు శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS నియోజక వర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతీ పాల్గొని మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా రెండవ పంట నష్టపోతున్న మేడారం, ఊరట్టం, నార్లాపూర్, వెంగళపూర్ రైతులు మేడారం జాతర పంట నష్టపరిహార సాధన సమితి అనే సంస్థను ఏర్పాట