తమకు ఇంటి స్థలాల కోసం దొడ్ల గ్రామస్తులు సహకరించాలని ఏటూరునాగారం మండలం కొండాయి ముంపు గ్రామ గిరిజనులు కోరారు. ఆదివారం ఉదయం దొడ్ల గ్రామంలో ఇంటి స్థలాల కోసం స్థానికులను అడిగారు. అయితే తాము కూడా గత వరదల్లో ఇల్లు, పంటలు ,పొలాలు నష్టపోయామని తమది కూడా ముంపు గ్రామమైనని దొడ్ల గ్రామస్థులు తెలిపారు. తమ గ్రామంలో వేరే గ్రామస్తులకు ఇంటి స్థలాలు ఇవ్వబోమని చెప్పారు. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.