సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళోజి నారాయణరావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు ,సిబ్బంది పాల్గొన్నారు.