తాడిపత్రి మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏ ఎస్ పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనాల ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తున్నారు.