సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో యూరియా నిలువలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అవసరమైన యూరియా నిలువలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా నిలువలపై తప్పుడు సమాచారాన్ని ఇస్తూ రైతులను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్... యూరియా నిలువలపై రైతులకు స