స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ శనివారం ఉదయం ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ – “ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలో ‘ఆంధ్రకేసరి