యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మోత్కూర్ అడ్డగోడూరు మండలాలకు చెందిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు అందరు కలిసి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎకౌంట్లో జమ చేసిన మూడు లక్షల రూపాయలతో పాటు ఏడు లక్షల రూపాయలను నిధులు జమ చేసి గ్రౌండ్ ని పూర్తి చేసి ప్రోసిడింగ్ పత్రాలు ఇవ్వాలని వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.