కాకినాడ జిల్లా పిఠాపురం గురువారం సాయంకాలం ఐదు గంటలకు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ మనీష్ పటేల్ దేవరాజ్ తనిఖీ చేశారు. ఆయన రికార్డులు, పెండింగ్లో ఉన్న కేసు ఫైళ్ళను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసిన ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.