కల్వర్టు పై నుండి లారీ ప్రమాదవశాత్తు చెరువులోకి వెళ్లిన సంఘటన జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడూరు వైపు వెళ్తున్న లారీ కేసరి సముద్రం చెరువు వద్ద ఉన్న కల్వర్టు ఇరుకుగా ఉండటంతో ప్రమాదవశాత్తు కల్వర్టు పై నుండి చెరువులోకి ఒరిగిపోయింది. అప్రమంతమైన డ్రైవర్ లారీని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.