సరూర్నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కలిసి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల శ్రీ వాణి మాట్లాడుతూ చెరువులో పూడిక తొలగించకపోవడంతో చిన్న విగ్రహాలు కూడా నీటిలో సరిగా మునగలేని పరిస్థితి ఏర్పడిందని భక్తుల కోసం టాయిలెట్లు తాగునీరు శానిటేషన్ వసతులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని తెలిపారు. స్పందించిన జోనల్ కమిషనర్ తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.