రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో భారీ ప్రొక్లయినర్ ను వేరేచోటకి తరలించేందుకు ట్రాలీ లారీపై ఎక్కిస్తుండగా, ఆ ప్రోక్లయినర్ ప్రమాదవశాత్తు మీద పడడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న సాలూరు నియోజకవర్గం లోని మెంటాడ మండలం వాణిజ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆండ్ర ఎస్ఐ సీతారాం బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొక్లయినర్ ను ట్రాలీ లారీపై ఎక్కిస్తుండగా మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రొక్లయినర్ పక్కకి ఒరిగిపోవడంతో దాని కింద బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ అనే లారీ డ్రైవర్ పడిపోయాడు.