కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1972-1974 మధ్య ఇంటర్మీడియెట్ చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఆదివారం సందడి చేశారు. చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.