సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఐఎఫ్టియు నాయకులు శనివారం మధ్యాహ్నం 3:10 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్రంలో 50వేల గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు._