తిరుపతి రేణిగుంట రోడ్ ఈనాడు ఆఫీస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వ్యక్తి డివైడర్ను ఢీకొని కింద పడ్డాడు అదే సమయంలో అటుగా వెళుతున్న బస్సు అతనిని ఢీ కొట్టింది దీంతో అతనికి తీవ్ర గాయాలై మృతి చెందినట్లు తెలుస్తోంది స్థానిక సమాచారంతో రేణిగుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.