పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం తాడిగడప మున్సిపాలిటీ కానూరు సనత్ నగర్ లో 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రహదారుల అభివృద్ధికి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు.