చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి బుధవారం 80 కేజీల భారీ లడ్డూను చిత్తూరు టిడిపి నాయకులు సమర్పించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విజయం సాధిస్తే స్వామివారికి 80 కేజీల లడ్డు సమర్పిస్తామని చిత్తూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రామినేని రాము మొక్కుకున్నారు బుధవారం మొక్కులు చెల్లిస్తూ స్వామి వారికి 80 కేజీల లడ్డూలు సమర్పించారు అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు.