లక్ష్మీ దేవమ్మ నివాళులర్పించిన వనపర్తి జిల్లా సిపిఎం పార్టీ నాయకులు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకురాలు ఎస్ఎస్ లక్ష్మీదేవమ్మ మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ మరియు మహిళా సంఘం కార్యదర్శిగా ఎనలేని సేవలు చేసిన లక్ష్మీదేవమ్మ సేవలను మరవరానివని ప్రజా పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేశారని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండీ జబ్బార్ తదితరులు ఉన్నారు.