రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవో 99 తీసుకొచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని జై భీమ్ సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు కాటం రాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నస్పూర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జీవో 99లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉందని, దీన్ని నిరసిస్తూ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి జీవో 99 సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.