అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్సీ భరత్ మరియు స్థానిక వైసిపి నాయకులు మంగళవారం కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొరత లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.