అనంతపురం నగరంలోని కేర్ అండ్ క్యూర్ ఆసుపత్రి సమీపంలో కాలువలోకి భారీ వాహనం ఇరుక్కుపోవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా పార్సెల్ సర్వీస్కు సంబంధించిన లారీ కావడంతో ఒక్కసారిగా కాలువ పైకి దూసుకెల్లడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం జెసిబి క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీశారు.