విజయపురం మండల కేంద్రంలో బుధవారం ఏంఈవో హరిప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి.. ఉపాధ్యాయులలోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం, పని ఒత్తిడి తగ్గించడం లక్ష్యంగా వాలీబాల్, సట్ ఫుట్, క్రికెట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి ప్రధానోపాధ్యాయులు సుమతి, కార్యదర్శి వెంకమరాజు పాల్గొన్నారు.