విశాఖపట్నం నుంచి 'బిగ్‌బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టిన దమ్ము శ్రీజ, తన ప్రత్యేకతతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నత స్థానంలో ఉన్న ఆమె, తన ప్రతిభకు సరైన గుర్తింపు కోసం ఈ రియాలిటీ షోను వేదికగా ఎంచుకుని, ఇప్పుడు తన ప్రయాణంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నెలకి లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, తన కలల కోసం బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడం శ్రీజ ధైర్యానికి నిదర్శనం. ఆడిషన్స్‌లో ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని, తన ప్రతిభతో వాటిని అధిగమించి, ఈ అద్భుతమైన అవకాశం దక్కించుకుంది.