ఎగువకురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద అనూహ్యంగాఅంతకంతకు పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉపనదులు పొంగి కొండవాగుల ఉధృతికి గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం స్పిల్ వే ఎగువన 30.640 మీటర్లు నమోదు కాగా స్పిల్ వే దిగువన 21.690మీటర్లు నమోదుకఅయింది 48 రేడియల్ గేట్ల ద్వారా 5,94,927 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను దిగువకు వదులుతున్నారు..