కర్నూలులోని హైకోర్టు ఏర్పాటు చేయాలని వైసీపీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు సువర్ణ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బెంచ్ ఏర్పాటు చేస్తామన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. హైకోర్టు సాధన కోసం మరోసారి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో జూనియర్ న్యాయవాదులకు ప్రతీ నెల రూ.10 వేలు స్టైఫండ్ ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు