జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలోని లెంకలగడ్డ గోదావరి సమీపంలో గురువారం రాత్రి పిడుగు పడి 100కు పైగా గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. మేత కోసం మహదేవ్పూర్ మండలం అంబటి పెళ్లి గ్రామానికి చెందిన సమ్మయ్య, ఆది,కత్తర్ శాల, మల్లేష్, పున్నమి చంద్రుడుకి చెందిన 100కు పైగా గొర్రెలు మేత కోసం లెంకలగడ్డ సమీపంలోకి గోదావరి వద్ద పడుకొ పెట్టి, చుట్టూ జాలి వేసి భోజనం కోసం అంబటిపెళ్లికి రాగా భోజనం అనంతరం వెళ్లి చూసేసరికి 100కు పైగా గొర్రెలు భారీ వర్షానికి, పిడుగుపాటుకు మృతి చెందినట్లు తెలిపారు.మొత్తం గొర్లు చనిపోవడంతో వీధిన పడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.