ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీలోని నర్రావాండ్లపల్లి గ్రామంలో కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి నివాసం నందు వారి కుటుంబ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు.అదేవిధంగా కలికిరి పట్టణంలోని రాములవారి ఆలయ పరిసర ప్రాంతమునకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రమేష్ మాతృ మూర్తి ఇటీవల పరమపదించారు. విషయం తెలుసుకున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం 8గంటలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.