శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్‌లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన “ఆకాంక్ష హాట్ – ఎగ్జిబిషన్ & సేల్”లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.ఈ సందర్భంగా గద్వాల్ పట్టు చీరల స్టాల్‌ను పరిశీలించి గద్వాల్ చీరల ప్రాధాన్యతను విస్తృతంగా తెలియజేయడానికి రాబోయే దసరా ఉత్సవాల్లో హైదరాబాద్ శిల్పరామంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు ప్లాస్టిక్ వినియోగం లేకుండా చెనగ పొట్టుతొ తయారు చేసిన టీ కప్పులు, పేపర్ ప్లేట్లు, పర్యావరణహిత వినాయక విగ్రహాలను పరిశీలించి అభినందించారు.