Download Now Banner

This browser does not support the video element.

కాఫీ తోట ఎకరానికి 1 లక్ష రూపాయల వరకు మద్దతు ధర ప్రకటించాలి- అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్

Araku Valley, Alluri Sitharama Raju | Sep 7, 2025
_కాఫీ పండు పండేటటువంటి సందర్భంలో కాఫీ పండు ధర 60 రూపాయల నుండి సుమారు 100 రూపాయల వరకు ఉంటుందని,నేడు పండు దశ రాకమునుపే ఈ పురుగులు పండు లోపల ఏర్పడడం వల్ల కాఫీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు._ _కాబట్టి ప్రభుత్వం కాఫీ రైతుల పరిస్థితులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని,ఇప్పుడు కోస్తున్న కాఫీ కాయలకు మద్దతు ధర కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.కాఫీ రైతులతో మాట్లాడడంతో వారు మద్దతు ధర కాఫీ కాయలకు 100 రూపాయలు & ఎకరానికి 60 వేల రూపాయలు నుండి 1 లక్ష రూపాయలు వరకు కేటాయిస్తే,తమకు న్యాయం జరుగుతుందని,పేర్కొన్నారని,తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us