దివ్యాంగులను సామాజిక సంక్షేమాభివృద్ధి ఫలాలకు అర్హులను చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం (DEF) ప్రతినిధులు శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి రూయీస్ ఫాతీమకు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర DEF అధ్యక్షుడు బి.సి. నాగరాజు, ఉపాధ్యక్షుడు కమతం వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రభుత్వం ఇటీవల తీసుకున్న దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించిన నిర్ణయం, దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, కార్పొరేషన్ రుణాల మంజూరు, ఇళ్ల పట్టాలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో 2016 వికలాంగుల