శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాన్ని మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ బీకే పార్థసారథి తదితరులు ఆవిష్కరించారు. శనివారం మధ్యాహ్నం వారు మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర గతంలో పెనుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారని అన్నారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిటాల రవీంద్ర అభిమానులు పాల్గొన్నారు.