నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గుర్తుతెలియని రైలు ఢీకొని 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతుడు ఎరుపు రంగు గల ఆఫ్ హ్యాండ్ టి షర్ట్, గ్రే కలర్ షార్ట్ ధరించి ఉన్నాడని ఆమె తెలిపారు. మృతుని వివరాలు తెలియలేదని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు