బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి విగ్రహాలను, పూజకు అవసరమైన వస్తు సామగ్రిని కొనుగోలు చేసేందుకు విచ్చేసిన ప్రజలతో బనగానపల్లె వీధులు కిటకిటలాడాయి. ఇళలలో పూజల కోసం బుల్లి గణనాథులను రూ.150 నుంచి రూ.200 వరకు కొనుగోలు చేస్తున్నారు. పాత బస్టాండు, ఆస్థానం, పెట్రోలు బంక్ కూడలి, అవుకు మెట్ట తదితర ప్రాంతాల్లో వినాయక ప్రతిమలు, పూజకు అవసరమైన సామగ్రి, పండ్లు, పూల విక్రయాలు జోరుగా సాగాయి.