గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుకు ఘనస్వాగతం లభించింది. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం విజయనగరం జిల్లాకు విచ్చేశారు. ఆయనకు స్థానిక అశోక్ బంగ్లా వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కుటుంబ సభ్యుల, ఇంచార్జి ఆర్డీవో మురళి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంగ్లాకు చేరుకొని, అశోక్ గజపతిరాజుకు పుష్ప గుచ్చం అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు.