ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన ఫిషరీస్ శాఖ కమిషనర్ ను మత్స్యకార నాయకులతో కలిసి కలిశారు.మత్స్యకారుల సమస్యలపై మంత్రి, కమిషనర్ సానుకూలంగా స్పందించారని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు మంగళవారం సాయంత్రం ప్రకటనలో ఐదు గంటలకు తెలిపారు.