నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో భారీ వర్షాలతో చెరువు కుంటకు గండి పడింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. అలాగే నిర్మల్ పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఏ అధికారి కూడా ఇండ్లలో ఉంటూ విధులు నిర్వహించవద్దని కోరారు.